మరో భారతీయ విద్యార్ధి హత్య, ఈసారి కెనడాలో
బ్రిటన్ లో అనిల్ బిద్వే హత్యకు గురైన కొన్ని రోజులకే మరో భారతీయ విద్యార్ధి హత్యకు గురయ్యాడు. ఈసారి వంతు కెనడా తీసుకుంది. ఇరవే యేడేళ్ళ ‘అలోక్ గుప్తా’ కెనడాలో తుపాకితో కాల్చి చంపబడ్డాడు. పశ్చిమ కెనడాలో సర్రే నగరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక స్టోర్ యజమానులు అందరూ కలిసి క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడానికి వీలుగా అలోక్ గుప్తా మధ్యాహ్నం షిఫ్టు పని…