ఛత్తీస్ ఘడ్ కలెక్టర్ విడుదలకు ప్రభుత్వము, మావోయిస్టుల ఒప్పందం
మావోయిస్టు గెరిల్లాల చేత కిడ్నాప్ కి గురయిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర జిల్లా కలెక్టర్ అలెక్స్ మీనన్ విడుదలకోసం మావోయిస్టు ప్రతినిధులకూ, ప్రభుత్వ ప్రతినిధులకు ఒప్పందం కుదిరినట్లు ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఒప్పందానికి మావోయిస్టు పార్టీ ఆమోద ముద్ర వేయాల్సి ఉండని తెలుస్తోంది. శనివారం ఒప్పందాన్ని మావోయిస్టులకు సమర్పించనున్నారు. “ఇప్పటికీ చర్చలు పూర్తయ్యాయి. కానీ అంతిమ ఒప్పందాన్ని మావోయిస్టులు ఆమోదించాల్సి ఉంది” అని మావోయిస్టుల తరపున చర్చల్లో పాల్గొంటున్న బి.డి.శర్మ తెలిపాడు. ఒప్పందం వివరాలు తెలపడానికి…
