తమ సిరియా దుష్ప్రచారానికి తామే బలైన బ్రిటన్ విలేఖరులు
సిరియా ‘కిరాయి తిరుగుబాటు’ పై వివాదాస్పద రీతిలో ఏకపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న పశ్చిమ దేశాల విలేఖరులకు కాస్తలో చావు తప్పింది. దుష్ట బుద్ధితో తాము రాస్తున్న అవాస్తవ వార్తలకు సరిగ్గా వ్యతిరేక అనుభవం ఎదురై ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ బైటపడ్డారు. తమ చావు ద్వారా అంతర్జాతీయంగా జరుగుతున్న దుష్ప్రచారంలో అదనపు పాయింట్లు కొట్టేద్దామనుకున్న కిరాయి తిరుగుబాటుదారుల అసలు స్వరూపం వెల్లడి చేయక తప్పని పరిస్ధితి చానెల్ 4 చీఫ్ కరెస్పాండెంట్ ‘అలెక్స్ ధాంసన్ ఎదుర్కొన్నాడు. కిరాయి…
