అమెరికాలో మళ్ళీ మంచు తుఫాను, ఈసారి దక్షిణాన -ఫోటోలు
జనవరి చివరిలో అమెరికాను మరోసారి మంచు తుఫాను వణికించింది. పోలార్ వొర్టెక్స్ ఫలితంగా జనవరి మొదటివారంలో మధ్య పశ్చిమ, ఈశాన్య అమెరికాలు గజగజ వణికిపోగా ఈసారి చలికాలంలో సంభవించే మంచు తుఫాను అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా అలబామా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాలను చలి పులి చుట్టుముట్టింది. ఈశాన్య అమెరికా నుండి కరోలినా, జార్జియాల మీదుగా టెక్సాస్ వరకూ విస్తరించి ఉన్న మంచు దుప్పటిని కింది ఫొటోల్లోని శాటిలైట్ చిత్రంలో చూడవచ్చు. మంచు తుఫాను దాటికి…
