మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ -1
(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకుని ప్రపంచానికి పరిచయం అయినప్పుడు ఆమె భారతీయ ఆంగ్ల సాహిత్యానికి కీర్తి, వన్నె తెచ్చిన ఒక అర్బన్ మహిళ. తర్వాత్తర్వాత భారత దేశ శ్రామిక ప్రజలకు నిఖార్సయిన, రాజీలేని మద్దతుదారుగా అవతరించిన అరుంధతి, భారత పాలక వర్గాలకు కంటిలో నలుసుగా మారారు. ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ వ్యాస రచన ద్వారా మావోయిస్టుల…