ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐల నిర్వచనం: సిఫారసులు ఆమోదం
ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ పెట్టుబడుల నిర్వచనానికి సంబంధించి మాయారాం కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ), విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐ)… ఈ పదబంధాల నిర్వచనాలను హేతుబద్ధం చేయడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం నేతృత్వంలో ఒక కమిటీని నియమించగా అది శనివారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సదరు నివేదిక చేసిన సిఫారసులను ఆమోదిస్తున్నట్లుగా కేంద్రం ఈ రోజు (సోమవారం, జూన్ 23) ప్రకటించింది. ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లను…