జన్ లోక్ పాల్ ఓటమి, రాజీనామా దిశగా అరవింద్

దేశ రాజకీయ చిత్రపటంపై తమను తాము ఉప్పు-నిప్పుగా చెప్పుకునే కాంగ్రెస్, బి.జె.పి లు ఒక తాటి మీదికి రావడంతో ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లు ప్రవేశ దశలోనే ఓటమిని ఎదుర్కొంది. దానితో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసే దిశలో ప్రయాణిస్తోంది. ముఖేష్ అంబానీపై రాష్ట్ర ఎ.సి.బి చేత అవినీతి కేసు నమోదు చేయించినందుకే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటయ్యాయని అరవింద్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఎంత దూరం అయినా…

కేజ్రీవాల్ పని: ఆజియన్ స్టేబుల్స్ శుభ్రపరచడం -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్ పని తీరు (వర్కింగ్ స్టైల్) పైన సున్నితమైన విమర్శ ఈ కార్టూన్. CLEANING OF AUGEAN STABLES అనే ఆంగ్ల వాడుకను కార్టూనిస్టు ఇందులో వినియోగించారు. ఆజియన్ అనే ఆయన గ్రీకు పురాణాల్లో ఒక రాజు. ఆయన వద్ద స్వర్గం నుండి ప్రసాదించబడిన పశు సంపద భారీగా ఉండేదిట. భారీ సంఖ్యలో ఉన్నందున వాటి విసర్జనాలు కూడా పెద్ద మొత్తంలో ఉండేవి. అందువలన ఆయనగారి పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం ఎవరికైనా అసాధ్యం. హెర్క్యూలియస్ అనే…

అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్

సామాన్యుడు తలచుకుంటే అద్భుతాలకు ఏమిటి కొదవ? ఆ మాటకొస్తే సామాన్యులే కాదా చరిత్ర నిర్మాతలు! సామాన్యుడి పేరుతో పార్టీ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ, సంకేతాత్మకమే అయినా, అలాంటి అద్భుతాలనే దేశ ప్రజలకు రుచి చూపిస్తోంది. కాకుంటే, ఈ దేశంలో పాలు తాగే పసిపిల్లలకు సైతం ఆదర్శ పురుషులుగా పరిచయం అయ్యే కార్పొరేట్ దిగ్గజాలపై అవినీతి కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం మునుపు ఎన్నడన్నా ఎరుగుదుమా? అంబానీ అంటే భారత దేశంలో ఒక బ్రాండ్. ఒక ట్రేడ్…

ఢిల్లీ సర్కార్: ఎలుకకు చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం -కార్టూన్

“పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం”, ఇది కదా అసలు సామెత! కానీ ఢిల్లీ సర్కార్ విషయంలో ఈ సామెత రివర్స్ అయిపోయింది. ‘టాం అండ్ జెర్రీ’ లోని ఎలుక తరహాలో కాంగ్రెస్ పిల్లిని ఎఎపి ఎలుక అదే పనిగా ఆట పట్టించడం జనానికి భలే పసందైన కనుల విందు. కాకపోతే మద్దతు ఇస్తున్న పార్టీ వణకడం ఏమిటి? మద్దతు తీసుకుంటున్న పార్టీ ‘మద్దతు వెనక్కి తీసుకుంటారా, అయితే తీస్కోండి’ అంటూ చిద్విలాసంగా సవాళ్ళు విసరడం ఏమిటి?…

అవినీతి నేతల చిట్టా -కార్టూన్

“ఈసారి నుండి సారూ, అవినీతికి పాల్పడని నాయకుల జాబితా తయారు చేయమని అడగండి. అలాగైతేనే సమయం వృధా కాదు…” – అవినీతి నేతల చిట్టా తయారు చేయడం ఎంత కష్టమో ఈ కార్టూన్ చెబుతోంది. అనేకమంది నేతల్లో అవినీతి నేతలను వెతుక్కోవలసి రావడం కాదు ఆ కష్టం. అవినీతి నేతలను కనిపెట్టడం తేలికే గానీ వారి పేర్లను రాస్తూ పోవడమే అసలు కష్టం. కనపడ్డా ప్రతి రాజకీయ నాయకుడూ ఏదో ఒక సందర్భంలో అవినీతి సంపాదన ఆరోపణ,…

ఎఎపి పాలన: అంబానీ లైసెన్స్ రద్దుకు సిఫారసు

ఢిల్లీ ప్రభుత్వం అన్నంత పనీ చేస్తోంది. జనానికి సబ్సిడీ ధరలకు విద్యుత్ ఇవ్వడానికి నిర్ణయించిన ఎఎపి ప్రభుత్వం వాస్తవ విద్యుత్ పంపిణీ ఖర్చులను నిర్ధారించుకోడానికి ప్రైవేటు డిస్కంలపై కాగ్ ఆడిట్ చేయించాలని నిర్ణయించడంతో అంబానీ, టాటా కంపెనీలు సహాయ నిరాకరణకు దిగిన సంగతి తెలిసిందే. తొండి కారణాలు చెప్పి విద్యుత్ సరఫరా బంద్ చేయడానికి వీలు లేదనీ, అలా చేస్తే డిస్కంల లైసెన్స్ లను రద్దు చేయడానికి కూడా వెనుకాబడబోమని సి.ఎం ఎ.కె హెచ్చరించినట్లుగానే మొదటి వేటు…

విద్యుత్ సబ్సిడీ: ఎఎపి ప్రభుత్వంపై ముప్పేట దాడి

యుద్ధం మొదలయింది. జనం పక్షాన నిలిస్తే ఏమవుతుందో ఎఎపికీ, జనానికీ తెలిసి వస్తోంది. ఇంకా తెలియకపోతే ఇప్పుడన్నా తెలియాలి. సాంప్రదాయ పార్టీల రాజకీయ నాయకులు, పరిశ్రమ వర్గాలు, వీరిద్దరి చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇప్పుడు మూడువైపుల నుండి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. మా ఆర్ధిక పరిస్ధితి బాగాలేదు కాబట్టి రోజుకి 10 గంటల కోత పెడుతున్నామని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు తమ పాత బాకీ…

ఎఎపి చేతిలో అవినీతి నాయకుల చిట్టా

అవినీతిపరులయిన రాజకీయ నాయకుల జాబితాను తయారు చేశామని ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మహా నాయకులని భావిస్తున్నవారి పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ పార్టీలకు చెందిన అగ్ర నాయకుల పేర్లతో కూడిన ఈ చిట్టాలో స్ధానం సంపాదించినవారికి వ్యతిరేకంగా ఎఎపి తన అభ్యర్ధులను నిలుపుతుందని కేజ్రీవాల్ తెలిపారు. తమ జాబితాలో రాహుల్ గాంధీ ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడని ఆయనకు వ్యతిరేకంగా తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం…

పత్రికల ఆక్రమణదారు కేజ్రీవాల్ -కార్టూన్

“ఆయన మా చోటు ఆక్రమించుకున్నాడు. వెంటనే ఖాళీ చేయమని చెప్పండి.” – తరచుగా పత్రికల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా కార్టూన్ లలో చోటు సంపాదించాలంటే వివిధ కళల్లో నిష్ణాతులై ఉండాలి. రాజకీయ కళ అందరు రాజకీయ నాయకులు ప్రదర్శించేదే. కానీ వారిలో కూడా ప్రత్యేక తరహాలో రాజకీయాలు చేయగలిగితేనే కార్టూనిస్టుల దృష్టిని ఆకర్షించగలరు. ప్రస్తుతం ఇలా కార్టూనిస్టులను ఆకర్షించే ప్రత్యేక కళలో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరితేరారని, పాత నిష్ణాతులకు కలవరం…

ఎఎపి ధర్నా: ఢిల్లీ వాసుల సంతృప్తి, కోర్టులో కేసులు

ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల తాము చాన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లయిందని ఢిల్లీ లోని ఖిర్కి ఎక్స్ టెన్షన్ వాసులు సంతృప్తి ప్రకటిస్తున్నారు. విదేశీయుల కార్యకలాపాల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదని, ఢిల్లీ మంత్రి సోమ్ నాధ్ భారతి తనిఖీ, ముఖ్యమంత్రి ధర్నా వలన తమ ఏరియాలో పోలీసుల నిఘా పెరిగిందని వారు తెలిపారు. కాగా ధర్నా నిర్వహించినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్…

ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…

ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ విషయంలో తలెత్తిన విభేదాలు చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని బలిగోరే వైపు నడుస్తున్నాయా? కాంగ్రెస్ చేసిన హెచ్చరిక ఈ అనుమానం కలిగిస్తోంది. అక్రమ మాదక ద్రవ్య వ్యాపారం, వ్యభిచారం నేరాలలో సంబంధం ఉన్న ఆఫ్రికా ర్యాకెట్ పై దాడి చేయాలన్న ఎఎపి మంత్రి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదు. ఫలితంగా ఎఎపి మంత్రే స్వయంగా దాడి చేయడంతో మొదలైన రగడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బహిరంగ ఆందోళనకు దిగడం వరకు దారి…

ఎన్నికల్లో రెడ్ కార్పెట్, పాలనలో నో కార్పెట్ -కార్టూన్

ఎర్ర తివాచీ పైన నడిచి వచ్చినట్లుగా ఢిల్లీ ఎన్నికల్లో నెగ్గి వచ్చిన ఎఎపికి పాలనలోకి వచ్చాక గాని మర్మం బోధపడలేదని ఈ కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్, బి.జె.పి లు చెప్పేది కూడా ఇదేగా? అవినీతిని అంతం చేయడానికి జన్ లోక్ పాల్ తేవాలంటూ అన్నా, అరవింద్ ల బృందం ఆందోళన చేస్తున్నపుడు ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది’ అని సవాలు విసిరాయి రాజకీయ పార్టీలు. సవాలు స్వీకరించిన అరవింద్ ఎఎపి కి అంకురార్పణ చేయగా…

ఎఎపి అనూహ్య పరిణామక్రమం -కార్టూన్

అసలది పార్టీయేనా అని ఈసడించుకున్నారు కొందరు. రాజకీయాలు చేయడం అంటే వీధుల్లో చేసేవి కావు అని సెలవిచ్చారు మరి కొందరు. ఎఎపి అసలు మా లెక్కలోనే లేదని హుంకరించారు బి.జె.పి నాయకులు. తనమీదనే పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ని చూసి హేళనగా నవ్వి తీసిపారేశారు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్! మరి ఇప్పుడో! ఎఎపి నుండి నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది అని రాహుల్ గాంధీ లెంపలు వేసుకుంటున్నారు. అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎఎపి ని అనుసరిస్తామని…

ఎఎపి జనతా దర్బార్

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తన మొట్ట మొదటి జనతా దర్బార్ నిర్వహించింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఎదురుగా రోడ్డుపైనే కూర్చుని దర్బార్ నిర్వహించగా జనం పోటెత్తారు. జనం భారీగా తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. సమస్యలతో కూడిన విజ్ఞాపనలు ఇవ్వడానికి ప్రజలు తోసుకోవడంతో ముఖ్యమంత్రి అరవింద్ ఒక దశలో వేదికను వదిలి వేళ్లిపోవాల్సి వచ్చింది. తగిన ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా…

ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్

“మన కాశ్మీరు పాలసీ పైన జనాభిప్రాయం ఏమిటో ఎస్.ఎం.ఎస్, ట్విట్టర్ ల ద్వారా తెలుసుకోవాల్సింది కాదా?” – కాశ్మీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సాధారణ విధానం నుండి పక్కకు తప్పుకుంది. ప్రతి పనికీ ప్రజల అభిప్రాయాన్ని కోరే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అటువంటి విధానం కాశ్మీరు ప్రజలకు మాత్రం వర్తించదని తన వింత విధానం ప్రకటించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద్వంద్వ విధానం కలిగి ఉందన్నట్లే, ముఖ్యంగా కాశ్మీరు విషయంలో.…