వీడియో మార్ఫింగ్ స్మృతి సలహాదారు పని?
జేఎన్యూ విద్యార్ధుల ఆందోళన, అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమం లకు సంబంధించి ఇంటర్నెట్ లోనూ, టి.వి న్యూస్ ఛానెల్స్ తదితర ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచారంలో ఉన్న 7 వీడియోల్లో మూడు వీడియోలలో ఉద్దేశ్యపూర్వకంగా మార్పులు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన మెజిస్టీరియల్ విచారణలో తేలిన సంగతి విదితమే. మార్పులు చేసిన మూడు వీడియోల్లో ఒక వీడియోను ఎడిట్ చేయగా, రెండు వీడియోలు కావలసిన అర్ధం వచ్చే విధంగా, కోరుకున్న ప్రభావం కలిగే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా మార్ఫింగ్ చేశారని…








