గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు
65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి.…