ప్రజా తిరుగుబాటును అపహాస్యం చేస్తూ మళ్ళీ అధికారాలు లాక్కున్న ఈజిప్టు మిలట్రీ
ఈజిప్టు ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు రద్దు, అధ్యక్షుడి అధికారాలకు కత్తెర, సర్వాధికారాలను తిరిగి చేజిక్కించుకోవడం మొదలయిన చర్యల ద్వారా ఈజిప్టు మిలట్రీ దేశ ప్రజల రక్తతర్పణకు విలువ లేకుండా చేసింది. మధ్య ప్రాచ్యంలో అంతర్జాతీయ బలా బలాలపై గణనీయమైన ప్రభావం పడనున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే ఈజిప్టు ప్రభుత్వంలోని సర్వాధికారాలనూ మిలట్రీ తిరిగి చేజిక్కించుకుని ఎన్నికలు నామమాత్రమేనని నిరూపించింది. మాజీ నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దించి ప్రజాస్వామిక గాలులను రుచి చూద్దామని…
