జపాన్ అణు కర్మాగారం పేలనున్న టైంబాంబుతో సమానం -అణు నిపుణుడు

భూకంపం, సునామిల్లో దెబ్బతిన్న జపాన్ లోని ఫుకుషిమా దైచి అణువిద్యుత్ కర్మాగారం వద్ద రేడియేషన్ తగ్గుతోందని జపాన్ ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబుతో సమానమని అమెరికాకి చెందిన అణు నిపుణుడు మిచియో కాకు హెచ్చరించాడు. న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న భౌతిక శాస్త్రవేత్త మిఛియో కాకు అమెరికాకి చెందిన డెమొక్రసీ నౌ టీవీ చానెల్ తో మాట్లాడుతూ జపాన్ అణు ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించాడు. ఫుకుషిమాలోని…