నిజమే నేను తప్పు చేశాను -ఫ్రాన్స్ విదేశీ మంత్రి మేరీ
“ట్యునీషియా వ్యాపారవేత్త సొంత విమానంలో ప్రయాణం చేయటం నా తప్పే” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఇప్పుడు లెంపలు వేసుకుంటోంది. ఓ పక్కన టునీషియా ప్రజలను రెండున్నర దళాబ్దాల పాటు నియంతలా పాలించిన అధ్యక్షుడు బెన్ ఆలీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ పోలీసుల చేతిలో అనేక మంది చనిపోతుండగా అతని సన్నిహితుడయిన వ్యాపారవేత్తకి చెందిన ప్రైవేటు విమానంలో విహారయాత్రకు ట్యునీషియా బయలుదేరి రావటంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎలియట్ మేరీ ప్రపంచ…