చైనా ఫోన్ కంపెనీ, యూనివర్శిటీలను హ్యాక్ చేసిన అమెరికా
“నిజాలు బైటికి రావడం మొదలైంది. మరిన్ని నిజాలు వెలువడకుండా ఎవరూ అడ్డుకోలేరు” అని ప్రకటించిన సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్, ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పినట్లుగానే మరొక నిజం వెల్లడి చేశాడు. హాంగ్ కాంగ్ లోని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ (లేదా ది పోస్ట్) పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చైనా లోని మొబైల్ ఫోన్ కంపెనీలను, సాంకేతిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన ఒక యూనివర్సిటీని అమెరికా హ్యాకింగ్ చేసి సమాచారం దొంగిలించిందని స్నోడెన్ వెల్లడి…