హజారే ఉద్యమంలో మా పాత్ర లేదు -అమెరికా
అన్నా హజారే దీక్ష వెనక అమెరికా ప్రోద్బలం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు గుప్పించడంతో అమెరికా నోరు విప్పింది. అన్నా ఉద్యమంలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త అన్నా హజారేకు మద్దతుగా భారత ప్రజలు చేస్తున్న నిరసనలపై అమెరికా అభిప్రాయాన్ని పత్రికలు పలుమార్లు కోరుతుండడంతో ఆ వ్యవహారం భారత దేశ అంతర్గత వ్యవహారంగా అమెరికా ప్రకటించింది. అంతర్గత వ్యవహారం అంటూనే అమెరికా తన పాత హెచ్చరికను మరోరూపంలో కొనసాగించింది.…