ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అమెరికాల మధ్య పెరుగుతున్న దూరం!?
గత శనివారం ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ అకస్మాత్తుగా అమెరికాపైన విరుచుకు పడ్డాడు. అమెరికాకి చెప్పకుండానే అమెరికా తాలిబాన్‌తో చర్చలు ప్రారంభించిందనీ, చర్చలు కొనసాగుతున్నాయని కూడా పత్రికలకు చెప్పేశాడు. ఆ తర్వాత అనివార్యంగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ కూడా తాము తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్నామని అంగీకరించవలసి వచ్చింది. పనిలో పనిగా ఐక్యరాజ్యసమితిలో తాలిబాన్, ఆల్-ఖైదాలపై గల ఆంక్షలు, నిషేధాల జాబితాను విడదీస్తూ తీర్మానం కూడా ఆమోదించారు. ఆ తీర్మానానికి ఇండియా కూడా…