తాలిబాన్ చేతిలో మరో నలుగురు అమెరికా సైనికులు హతం
ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో తాలిబాన్ మిలిటెంట్ల బాంబు దాడిలో బుధవారం మరో నలుగురు అమెరికా సైనికులు చనిపోయినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. సాపేక్షికంగా తాలిబాన్ కి బలం లేదని భావించే ఉత్తర ఆఫ్ఘనిస్ధాన్ లోని ఫార్యబ్ రాష్ట్రంలో ఈ దాడి చోటు చేసుకుంది. నాటోకి చెందిన ఐ.ఎస్.ఏ.ఎఫ్ (ఇంటర్నేషనల్ సెక్యూరిటి ఆసిస్టెన్స్ ఫోర్స్) మాత్రం ఇద్దరు సైనికులు మరణించినట్లు ప్రకటించింది. అయితే ఫార్యబ్ బాంబు దాడుల్లో మరణించినవారు తమ లెక్కలో లేరని ఐ.ఎస్.ఏ.ఎఫ్ తెలిపింది. ఈ లెక్కన…
