‘నందిగ్రాం హింస’తో అమెరికాలో శిక్షణార్హత కోల్ఫోయిన ఐ.పి.ఎస్ అధికారి -వికీలీక్స్

తమ భూముల్ని అక్రమంగా లాక్కుని ఇండోనేషియా వ్యాపార గ్రూపుకి అప్పగించడానికి వ్యతిరేకంగా నందిగ్రాం ప్రజలు జరిపిన వీరోచిత పోరాటంపై కాల్పులు జరిపి అనేకమంది చనిపోవడానికి కారణమయ్యాడన్న ఆరోపణ ఉండడం వలన అమెరికాలో ట్రైనింగ్ పొందే అవకాశాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి కోల్పోయిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. అమెరికాలో పోలీసు, మిలట్రీ శిక్షణ పొందాలనుకునే వారు మానవహక్కులు గౌరవించడంలో వ్యతిరేక రికార్డు ఉండకూడదని అమెరికా చట్టాలు నిర్దేశిస్తాయి. నందిగ్రాం ఆందోళకారులపై…