బ్లాక్ టీనేజర్ హత్య పై అట్టుడుకుతున్న అమెరికా
ఫిబ్రవరి 26 వ తేదీన ఫ్లోరిడా రాష్ట్రంలో తెల్ల జాతికి చెందిన పోలీసు ఒకరు నల్ల జాతికి చెందిన టీనేజర్ ను కాల్చి చంపిన విషయంలో అమెరికా అంతటా నిరసనలు చెలరేగుతున్నాయి. 17 యేళ్ళ వయసు కలిగిన ట్రేవాన్ మార్టిన్ నిరాయుధుడుగా ఉన్నప్పటికీ పోలీసు (జిమ్మర్ మేన్ – 28 సం.) అతనిని ‘ఆత్మ రక్షణ’ కోసం చంపినట్లుగా చెబుతున్నాడు. బ్లాక్ టీనేజన్ హత్యలో పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో దానికి కారణం జాతి పక్ష…
