యు.ఎస్ ఆర్ధిక సంక్షోభం పోనేలేదు, రుణ సంక్షోభం చుట్టుముడుతోంది – కార్టూన్

అమెరికాలో ఉన్న “టూ బిగ్ టు ఫెయిల్” కంపెనీలు ప్రజల పన్నులు, ప్రభుత్వ అప్పులు మెక్కి సంక్షోభం నుండి కోలుకున్నప్పటికీ అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. బడా కంపెనీలు, ముఖ్యంగా ప్రవేటు ఇన్‌వెస్ట్‌మెంటు బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధలు బెయిలౌట్లుగా ప్రభుత్వ అప్పులను భోంచేయడంతో అమెరికా ప్రభుత్వానికి అది పెనుభారమై కూర్చుంది. కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగం పెరిగి అధిక ఉత్పత్తి సంక్షోభానికి దారి తీస్తున్నది. ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం పైన అనుమానాలు, అప్పు…

గ్లోబల్ రికవరీకి ప్రమాదం పొంచి ఉంది, వెంటనే చర్యలు తీసుకొండి -ఐ.ఎం.ఎఫ్

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ఐ.ఎం.ఎఫ్ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుండి కుంటుతూ కోలుకుంటున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి సంక్షోభంలో జారిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప దాన్ని అరికట్టలేమని ఐ.ఎం.ఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ట్రీన్ లాగార్డే తెలియజేసింది. “ఈ వేసవిలో జరిగిన పరిణమాలు, మనం ప్రమాదకరమైన కొత్త దశలో ఉన్నమాని సూచిస్తున్నాయి. బలహీనంగా ఉన్న ఆర్ధిక రికవరీ…

“అప్పు” పై యుద్ధంలో అమెరికా, యూరప్ లకు చైనా సహాయం -కార్టూన్

యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా రుణ సంక్షోభంలో ఉన్న సంగతి విదితమే. యూరోపియన్ రుణ సంక్షోభం ఫలితంగా గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు దివాలా అంచుకు చేరాయి.స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్సులు సంక్షోభం బాటలో ఉన్నాయి. బ్రిటన్, జర్మనీల పరిస్ధితి కూడా ఏమంత ఘనంగా లేదు. ఇటీవల యూరప్ పర్యటించిన చైనా ప్రధాని, రుణ సంక్షోభం నుండి బైటికి రావడానికి సహాయం చేయడానికి చైనా రెడీ అని హామీ ఇచ్చాడు. అమెరికా అప్పులో దాదాపు రెండు ట్రిలియన్ల వరకు…

మంగళవారం కూడా పతనమైన భారత షేర్ మార్కెట్లు, తొలగని అనిశ్చితి

భారత షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనమయ్యాయి. అమెరికా రుణ సంక్షోభం దరిమిలా ఎస్&పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడంతో సోమవారం ప్రపంచవ్యాపితంగా షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయీన సంగతి తెలిసిందే. మంగళవారం భారత షేర్లు విపరీతమయిన ఎగుడుదిగుడులకు గురయ్యాయి. దాదాపు 1600 పాయింట్ల మేరకు గత ఐదు రోజులుగా ఉత్ధాన పతనాలకు గురైన భారత షేర్లు ప్రారంభంలో సోమవారం నాటి ధోరణిని కొనసాగిస్తూ భారిగా పతనమైన సూచిలు మధ్యాహ్నానికి కోలుకుని లాభాల బాట…

రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ 50 సం. పూర్తి చేసుకున్న బారక్ ఒబామా

నెలల తరబడి సాగిన వేడి వేడి చర్చల అనంతరం, ఏకాభిప్రాయ సాధనకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు ఆగష్టు 4 తో 50 సంవత్సరాలు నిండాయి. ఆమెరికా కాంగ్రెస్‌లో మెజారిటీ ఉన్న రిపబ్లికన్ల నుండి దీని పట్ల తీవ్రం విమర్శలు వ్యక్తం అయ్యాయి. “ప్రస్తుతం ఈ దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుండగా, మనిషి జీవ పరిణామ క్రమంలో భాగమైన వయసు మీరే ప్రక్రియకు తన సమయాన్ని వెచ్చించడం, అమెరికన్లందరినీ అవమానించడమే” అని…

తగలబడుతున్న కాగితం డబ్బు, రెక్కలిప్పిన బంగారం ధర -కార్టూన్

అమెరికా రుణ సంక్షోభం పుణ్యమాని ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు మళ్ళీ కనపడుతున్నాయి. సోమవారం కుప్ప కూలిన షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనాన్ని కొనసాగిస్తున్నాయి. జారడం మొదలవ్వాలేగానీ ఎక్కడ ఆగుతామో తెలియదన్నట్లుగా ఉంది షేర్ మార్కెట్ల పరిస్ధితి. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా లలోని ప్రధాన షేర్ సూచీలన్నీ పతన దిశలో సాగుతూ ఇన్‌వెస్టర్లను, వ్యాపారులనూ, ప్రభుత్వాధికారులను, మార్కెట్ నియంత్రణా సంస్ధలనూ, ప్రభుత్వాలనూ వణికిస్తూ కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అమెరికా రుణ సంక్షోభం…

అమెరికా రుణ సంక్షోభానికి తాత్కాలిక మాట్లు -కార్టూన్

అమెరికా రుణ పరిమితిని $2.1 పెంచడానికీ, బడ్జెట్ లోటు $2.1 ట్రిలియన్ తగ్గించడానికి రిపబ్లికన్లు, డెమొక్రట్లు కుదుర్చుకున్న ఒప్పందం సంక్షోభంలో ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు తాత్కాలికంగా మాట్లు వేస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం దానివలన రాదు. అమెరికా ప్రజల మౌలిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, బడా కంపెనీల దోపిడి, వేతనాల స్తంభన… మొదలైన సమస్యలను పరిష్కరించకుండా,ఆర్ధిక వ్యవస్ధలొని వివిధ ప్రధాన అంగాల్లో తాత్కాలికంగా మాట్లు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించడం అవివేకం. అది…

రుణ సంక్షోభంపై అమెరికాని లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన చైనా

రుణ సంక్షోభాన్ని అమెరికా ప్రభుత్వం ఎదుర్కొన్న పద్దతిపై చైనా మొదటిసారిగా స్పందించింది. సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుని తీవ్రంగా ఎండగట్టింది. కనీసం కామన్ సెన్స్ కూడా లేదని లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది. డాలర్ ఆధిపత్యం వహించే రోజులు పోయాయని హెచ్చరించింది. ఇలాగే ఉంటే మరో కరెన్సీని అంతర్జాతీయ కరెన్సీగా ఎన్నుకోవాల్సి ఉంటుందని క్లాస్ పీకింది. ఆర్దిక వ్యవస్ధని అప్పులపై ఆధారపడి నడపడాన్ని ఎద్దేవా చేసింది. అమెరికా రుణ సంక్షోభం నుండి బైటపడడానికి రాజకీయ పక్షాలు జరిపిన చర్చలు…

కుప్ప కూలిన షేర్ మార్కెట్లు, వణికిస్తున్న అమెరికా, యూరప్ సంక్షోభాలు

శుక్రవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్ 383.31 పాయింట్లు (2.19 శాతం) నష్టపోయి 17305.87 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ సూచి 120.55 పాయింట్లు (2.26 శాతం) నష్టపోయి 5211.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఒక దశలో సెన్సెక్స్ మానసిక స్ధాయి17000 పాయింట్లకు తక్కువగా 16990.91 వరకూ పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. నిఫ్టీ కూడా ఓ దశలో 5200 పాయింట్లకు తక్కువగా 5116.45 వరకూ పడిపోయి అనంతరం కోలుకుంది. అమెరికా రుణ సంక్షోభం, యూరప్ సావరిన్ అప్పు…