రష్యా ఎత్తులను పసిగట్టలేకపోతున్నాం -అమెరికా

ప్రపంచం లోని వివిధ యుద్ధ క్షేత్రాలలో అమెరికా మద్దతు ఉన్న పక్షాలు వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపధ్యంలో అమెరికా మిలట్రీ అధికారులు నిస్పృహకు లోనవుతున్నారని వారి ప్రకటనలు సూచిస్తున్నాయి. రష్యాయే ఇప్పుడు తమకు ప్రధాన శత్రువు అని ప్రకటించెంతవరకూ వారు వెళ్తున్నారు. “సెప్టెంబర్ 11, 2001 తర్వాత అమెరికా గూఢచార విభాగం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద వైఫల్యం మాస్కో ఎత్తులను ముందుగా పసిగట్టలేకపోవడం. ఈ వైఫల్యం ఫలితంగా క్రిమియాపై రష్యా దాడిని ముందుగా పసిగట్టలేకపోయాము. సిరియాలో రష్యా…

రష్యాలో అమెరికా రాయబారి గూఢచర్యం, బహిష్కరణ

గూఢచర్యం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఒక అమెరికా రాయబారిని రష్యా ప్రభుత్వం అరెస్టు చేసింది. తర్వాత విడుదల చేసి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం అమెరికా రాయబార కార్యాలయం ప్రధాన రాయబారిని విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకుని తన నిరసన తెలియజేసింది. ‘ప్రచ్ఛన్న యుద్ధం’ ముగిసిందని ప్రకటించినప్పటికీ అమెరికా, రష్యాల మధ్య గూఢచర్యం ఇంకా చురుకుగా కొనసాగుతోందనడానికి తాజా బహిష్కరణ మరొక సూచిక. రెండేళ్ల క్రితం అమెరికాలో గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అరడజనుకు…