ఘోరంగా పడిపోయిన పారిశ్రామిక వృద్ధి, షాక్‌లో మార్కెట్లు
అసలే అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలతో, అమెరికా ఆర్ధిక వృద్ధి నత్త నడకతోనూ నష్టాలతో ప్రారంభమైన ఇండియా స్టాక్ మర్కెట్లకు పారిశ్రామిక వృద్ధి సూచిక గణాంకాలు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాయి. పారిశ్రామిక వృద్ధి సూచిక (ఐఐపి – ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) మార్కెట్ అంచనాలను మించి క్షీణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పెద్ద ఎత్తున నష్టాలను రికార్డు చేశాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి సెన్సెక్స్ రెండు శాతం పైగా 390 పాయింట్లు కోల్పోయి 16485…