అమెరికా: ఎట్టకేలకు ఒప్పందం, సంక్షోభం వాయిదా

సెనేట్ లో ఉభయ పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో ఎట్టకేలకు అమెరికా ఋణ పరిమితి సంక్షోభం, ప్రభుత్వ మూసివేత సంక్షోభం తాత్కాలికంగా పరిష్కారం అయ్యాయి. జనవరి 15 వరకు ప్రభుత్వ ఖర్చులు ఎల్లమారే బడ్జెట్, ఫిబ్రవరి 7 వరకూ అందుబాటులో ఉండే ఋణ పరిమితి పెంపుదల… ఒప్పందంలోని ప్రధాన అంశాలు. అనగా సంక్షోభం వాయిదా వేశారు తప్ప పరిష్కారం కాలేదు. పరిష్కారం చేసుకోడానికి వీలయిన చర్చలు చేయడానికి సమయం మాత్రం దక్కించుకున్నారు. దానర్ధం పరిష్కారం తధ్యం అని…

అమెరికా: ఋణ పరిమితి చర్చలు మళ్ళీ విఫలం

అమెరికాలో ఋణ పరిమితి చర్చలు మళ్ళీ పతనం అయ్యాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నాయకులు ప్రతిపాదించిన బిల్లుకు ఆ పార్టీ సభ్యల్లోనే మద్దతు కొరవడడంతో అది సభలోకి ప్రవేశించకముందే ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని కన్సర్వేటివ్ గ్రూపులు కోచ్ బ్రదర్స్, టీ పార్టీలు ప్రచారం చేయడంతో ప్రతినిధుల సభలో రిపబ్లికన్ నేత, స్పీకర్ జాన్ బోయ్ నర్ ప్రయత్నాలు వమ్ము అయ్యాయి. దానితో అమెరికా పరపతి రేటింగును తగ్గించాల్సి ఉంటుందని ఫిచ్ ఋణ రేటింగు సంస్ధ…

పొదుపు చేయాలి వృద్ధి చెందాలి, ఎలా? -కార్టూన్

ఏనుగు గారు: ఆర్ధిక వ్యవస్ధ నడక సాగాలంటే -మన పౌరులను ఖర్చు చేసేలా ప్రోత్సహించడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. నిద్ర లోంచి మేల్కొన్న అలారం: పొదుపు… పొదుపు… అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గురించి ఆ దేశ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రతిబింబించే కార్టూన్ ఇది. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు. ఏనుగు గారు పడక కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని జనాన్ని తమ వద్ద ఉన్న డబ్బుని ఖర్చు పెట్టించి తద్వారా అమెరికా ఆర్ధిక…