ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం – 2

సేమౌర్ హెర్స్ ఇంకా ఇలా రాశాడు. “అయితే అమెరికాకి చెందిన అత్యంత ఉన్నత స్ధాయి రహస్య గూఢచార నిర్ధారణలతో సహా పెద్ద పెద్ద సాక్షాలు (large body of evidence) అమెరికా సద్దామ్ హుస్సేన్, ఇరాక్ ల విషయంలో ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన తప్పులాంటి తప్పునే మళ్ళీ ఇరాన్ విషయంలోనూ చేసే ప్రమాదంలో ఉందని సూచిస్తున్నాయి. ఒక నిర్భంధ పాలకుడి విధానాలపై ఉన్న ఆత్రుతకొద్దీ ఆ ప్రభుత్వ మిలట్రీ సామర్ధ్యాలూ, ఉద్దేశాలపైన మన అంచనాలు తప్పు…