పాకిస్ధాన్‌కి అమెరికా మిలట్రీ సాయాన్ని మళ్ళీ విమర్శించిన ఇండియా
అమెరికా, పాకిస్ధాన్‌కి బిలియన్లకొద్దీ మిలట్రీ సహాయం ఇవ్వడాన్నీ భారత దేశం మరొకసారి విమర్శించింది. అమెరికా, ఇండియాల సంబధాల మధ్య ఈ అంశం మొదటినుండీ ఒక చికాకు గా ఉంటూ వచ్చింది. పాకిస్ధాన్‌కి అందిస్తున్న మిలట్రీ సహాయంలో చాలా భాగం ఇండియాకి వ్యతిరేకంగా రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వినియోగిస్తోందని భారత ఆరోపిస్తున్నది. న్యూయార్కు నగరంలోని జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగినప్పటినుండీ టెర్రరిజంపై పోరాటంలో సహకరిస్తున్నందుకు అమెరికా, పాకిస్ధాన్‌కి 20.7 మిలియన్ డాలర్లను (రు. 95220 కోట్లు) సహాయంగా…