అమెరికా: ఆర్ధిక కష్టాలతో మిలట్రీ ఖర్చుల కోత
“మన కోశాగార (ఆదాయం) సవాళ్ళ పరిమాణం యొక్క వాస్తవికతను గుర్తించే బడ్జెట్ ఇది. మనం ఉంటున్న ప్రమాదకరమైన ప్రపంచంలో, ఈ దేశపు భద్రతను కాపాడుకోవడంలో మనకి గల కీలక పాత్ర నేపధ్యంలో, అస్ధిరమైన ప్రపంచ పరిస్ధితులకు తగిన విధంగా రూపొందించిన బడ్జెట్” అని 2015 సం రక్షణ బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ చక్ హెగెల్ చెప్పారని సి.ఎన్.ఎన్ తెలిపింది. “మునుముందు ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మనం ముందున్న వాస్తవికత అదే” అని ఆయన నిర్మొహమాటంగా…
