పాక్ సాయంలో భారీ కోతకు ఆమోదించిన అమెరికా కాంగ్రెస్
పాకిస్ధాన్ కి ఇస్తున్న సాయంలో భారీ కోత విధించడానికి అమెరికా సిద్ధపడుతునంట్లు కనిపిస్తోంది. 650 మిలియన్ డాలర్ల కోత విధించే బిల్లును అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ కి మెజారిటీ సభ్యులున్న అమెరికా ప్రతినిధుల సభలో సీనియర్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ‘టెడ్ పో’ ప్రవేశ పెట్టిన బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. పాకిస్ధాన్ ను అమెరికా విప్లవంలో విద్రోహిగా ముద్ర పడిన “బెనెడిక్ట్ ఆర్నాల్డ్” గా ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడొకరు…
