అమెరికా సైనికులు తాగొచ్చి హత్యాకాండకి దిగారు -రాయిటర్స్, డెయిలీ మెయిల్
తొమ్మిది మంది పిల్లలతో సహా 16 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న అమెరికా సైనికులు శుభ్రంగా తాగి వచ్చి ఆఫ్ఘన్ ప్రజల ఇళ్ళలో చొరబడ్డారనీ, కనపడినవారినందరినీ కాల్చి చంపారనీ ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “వాళ్ళంతా బాగా తాగి ఉన్నారు. నవ్వుకుంటూ, కేకలు వేసుకుంటూ కనపడిన ఆఫ్ఘన్లను కాల్చి చంపారు” అని అమెరికా సైనికుల కాల్పుల్లో పదకొండు మందిని కోల్పోయిన కుటుంబానికి పక్కనే నివశిస్తున్న ‘ఆఘా లాలా’ చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. “వాళ్ళ శరీరాల…
