బ్లాక్ టీనేజర్ హత్య: అమెరికా వ్యాపితంగా నిరసనలు -ఫొటోలు

బ్లాక్ టీనేజర్ ట్రేవాన్ మార్టిన్ (17 సం.) ను తెల్ల పోలీసు కాల్చి చంపిన కేసును ‘జాత్యహంకార హత్య’ గా భావిస్తున్నారు. హత్య చేసిన పోలీసు ‘ఆత్మ రక్షణ’ నిమిత్తం టీనేజర్ ని కాల్చిచంపానని చెప్పడంతో అతనిని పోలీసులు అరెస్టు చేయలేదు. దానితో రెండు వారాలుగా అమెరికా అంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రారంభంలో ఫ్లోరిడా రాష్ట్రంలో కేంద్రీకృతమైన ఈ ప్రదర్శనలు క్రమంగా అమెరికా అంతటా విస్తరించాయి. ఫిలడెల్ఫియా, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ తదితర నగరాల్లో ‘మిలియన్…