ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం -1

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, యూరప్ దేశాలు దుష్ప్రచారం చేస్తూ ఆ దేశంపై నాలుగు దఫాలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియా అణు బాంబు నిర్మిస్తున్నదంటూ మరో అబద్ధపు ప్రచారం లంకించుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు అమెరికా, ఐరోపా దేశాల ప్రపంచ ఆధిపత్య రాజకీయాలో కోసమే అటువంటి అబద్ధపు ప్రచారానికి దిగుతాయన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ అణు ఇంధన సంస్ధ ఐన ఐ.ఎ.ఇ.ఏ, తాజాగా ఇరాన్ విషయంపై చర్చించడానికి సమావేశం…

ఆఫ్రికాపై సామ్రాజవాద ఆధిపత్యం కోసం అమెరికా దీర్ఘకాలిక యుద్దం -జేమ్స్ పెట్రాస్

ఆఫ్రికా ఖండంలోని దేశాలలోని వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా 1950 ల నుండే మిలట్రీ జోక్యం ప్రారంభించిందనీ, దానిలో భాగంగానే ప్రస్తుతం లిబియాలోని గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలమైన దిష్టిబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఫ్రాన్సు, బ్రిటన్ లతో కలిసి దురాక్రమణ దాడులకు పూనుకుందని అమెరికాకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జేమ్స్&‌ పెట్రాస్ వివరించాడు. ఆయన మాటల్లొనే చెప్పాలంటే: ——————– “కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్” ఆధ్వర్యంలో ‘లారెన్ ఫ్లోక్’ అధ్యయనం చేసి ఒక నివేదికను నవంబరు…

సామ్రాజ్యవాదుల ఆధ్వర్యంలో లిబియా విప్లవం

విక్టర్ నీటో వెనిజులాకి చెందిన కార్టూనిస్టు. ఈ కార్టూను మొదట ఆయన బ్లాగులోనూ, తర్వాత మంత్లీ రివ్యూ పత్రిక ఇండియా ఎడిషన్ లోనూ ప్రచురితమయ్యింది. సాధారణంగా ఏదైనా దేశంలో విప్లవాలు సంభవిస్తే వాటికి ప్రజల చొరవ ప్రధానంగా ఉంటుంది. అలా ప్రజల చొరవ ఉంటేనే ఏ విప్లవమైనా విప్లవం అనిపించుకుంటుంది. కానీ లిబియాలో గడ్డాఫీకి వ్యతిరేకంగా చెలరేగిందని చెబుతున్న విప్లవానికి సామ్రాజ్యవాద దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నాయకత్వం వహిస్తున్నాయి. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ సేనలు…

అమెరికాతో ‘ఎస్.ఒ.ఎఫ్.ఏ’ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై అమెరికా ఒత్తిడి

అమెరికాతో ఇండియా “సోఫా” ఒప్పందం (ఎస్.ఓ.ఎఫ్.ఏ) ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన సంగతి వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బయటపడింది. అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఉప ప్రధానాధికారి ఆగష్టు 16, 2005 తేదీన రాసిన కేబుల్ నెం. 38759 ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మిలట్రీ డ్రిల్లు నిమిత్తం ఇండియా వచ్చే మిలట్రీ అధికారులకు, రాజకీయ, రాయబార అధికారులకు ఇచ్చిన విధాంగానే “డిప్లోమేటిక్ ఇమ్యూనిటీ” (రాయబార కార్యాలయ ఉద్యోగులకు వారు నియమించబడిన దేశాల…

‘నందిగ్రాం హింస’తో అమెరికాలో శిక్షణార్హత కోల్ఫోయిన ఐ.పి.ఎస్ అధికారి -వికీలీక్స్

తమ భూముల్ని అక్రమంగా లాక్కుని ఇండోనేషియా వ్యాపార గ్రూపుకి అప్పగించడానికి వ్యతిరేకంగా నందిగ్రాం ప్రజలు జరిపిన వీరోచిత పోరాటంపై కాల్పులు జరిపి అనేకమంది చనిపోవడానికి కారణమయ్యాడన్న ఆరోపణ ఉండడం వలన అమెరికాలో ట్రైనింగ్ పొందే అవకాశాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి కోల్పోయిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. అమెరికాలో పోలీసు, మిలట్రీ శిక్షణ పొందాలనుకునే వారు మానవహక్కులు గౌరవించడంలో వ్యతిరేక రికార్డు ఉండకూడదని అమెరికా చట్టాలు నిర్దేశిస్తాయి. నందిగ్రాం ఆందోళకారులపై…

అమెరికా విషయంలో బిజెపి ది రెండు నాల్కల ధోరణి -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి చేసిన తీవ్ర విమర్శలు నిజానికి అంత తీవ్రంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిజేపి నాయకులే చెప్పిన సంగతిని అమెరికా రాయబారి కేబుల్ ద్వారా బయట పడింది. బిజేపి ది రెండు నాల్కల ధోరణి అనీ అమెరికాతో ఒప్పందాలపై బిజేపి ప్రకటించే వ్యతిరేకత అధికారం కోసమే తప్ప అందులో నిజం లేదని భారత దేశంలో ఎం.ఎల్ పార్టీలు చెప్పడం వాస్తవమేనని వికీలీక్స్ లీక్ చేసిన అమెరికా రాయబారుల కేబుళ్ళ ద్వారా ఇప్పుడు…

లిబియాపై దాడికి రెడీ, పశ్చిమదేశాల మరో దుస్సాహసం

గడ్డాఫీ నుండి లిబియా ప్రజలను రక్షించే పేరుతో లిబియాపై దాడి చేయడానికి పశ్చిమ దేశాలు సిద్ధమయ్యాయి. వాటికి కొన్ని అరబ్ దేశాలు సహకరించనున్నాయి. గడ్డాఫీ తనపై తిరుగుబాటు చేస్తున్న ప్రజలను చంపుతున్నాడనే సాకుతో అతని యుద్ధవిమానాలు ఎగరకుండా ఉండటానికి “నిషిద్ధ గగనతలం” అమలు చేస్తామని పశ్చిమ దేశాలు కొన్ని వారాలుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. లిబియాలోని తూర్పు ప్రాంతాన్నీ, పశ్చిమ ప్రాంతంలోని కొన్ని పట్టణాలను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులపై గడ్డాఫీ బలగాలు వారం రోజులనుండి దెబ్బమీద దెబ్బ…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 2

తర్వాత నవంబరులో జరిగిన ఐ.ఏ.ఇ.ఏ సమావేశంలో ఇరాన్ పై ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు. సీక్రెట్ వర్గీకరణతో డిసెంబరు 12 న పంపిన కేబుల్లో అమెరికా రాయబారి ఇరాన్-ఇండియా ల విషయం లేవనెత్తాడు. “మధ్యప్రాచ్యం కి సంబంధించి సమగ్రమైన విధానం రూపొందించుకోవడంలో ఇండియా సమర్ధతను చూపలేక పోయింది” అని రాశాడు. (ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వరకు ఉన్న అరబ్, ముస్లిం దేశాలను కలిపి ‘మధ్యప్రాచ్యం’ గా సంభోధిస్తారు.) అంటే అమెరికా, ఇజ్రాయెల్ లకు అనుకూలంగా విదేశీ…

ఇటలీ అమెరికా సంబంధాలను దెబ్బతీసిన ఇండియా శాటిలైట్ ప్రయోగం -వికీలీక్స్

ఇండియాలో మానవ నిర్మిత ఉపగ్రహాన్ని (శాటిలైట్) ప్రయోగిస్తే అది ఇటలీ, అమెరికాల సంబంధాలను సంవత్సరం పాటు వేడెక్కించింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా ఇటలీ అమెరికాల సంబంధాల బలం ఇండియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోట లో నిక్షిప్తం అయి ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇటలీలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికీ, ఇండియాలోని అమెరికా రాయబారికీ మే 26, 2007 తేదీన పంపిన కేబుల్ లో ఈ వివరాలు ఉన్నాయి. ఏప్రిల్ 23, 2007…