టెర్రరిస్టులకు ఐ.ఎస్.ఐ మద్దతునిస్తోంది -అమెరికా మిలట్రీ ఛీఫ్
ఆఫ్ఘనిస్ధాన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ రహస్యంగా మద్దతునిస్తోందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి “మైక్ ముల్లెన్” సంచలనాత్మక ఆరోపణ చేశాడు. మైక్ ముల్లెన్ పాకిస్తాన్ మిలట్రీ అధికారులతో చర్చల నిమిత్తం ఇస్లామాబాద్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ మిలిటెంట్ల నాయకుడు జలాలుద్దీన్ హఖానీ నడుపుతున్న సంస్ధతో ఐ.ఎస్.ఐకి దీర్ఘకాలింగా గట్టి సంబంధాలు ఉన్నాయనీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను చంపడంలో ఈ సంస్ధ నిమగ్నమై ఉందనీ ఆరోపించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో టెర్రరిస్టు సంస్ధలుగా అమెరికా పరిగణించే సంస్ధలను…