అత్యాధునిక అమెరికా గూఢచారి విమానాన్ని నేలకూల్చిన ఇరాన్

అత్యాధునికమైన తన మానవ రహిత గూఢచార డ్రోన్ విమానాన్ని ఇరాన్ గగనతలంలో ఎగురుతూ గూఢచర్యానికి పాల్పడుతుండగా ఇరాన్ నేలకూల్చడంతో అమెరికా మింగలేక, కక్కలేక ఉంది. తన గూఢచర్య విమానాన్ని ఇరాన్ నేల కూల్చలేదనీ, దానంతట అదే కొన్ని సమస్యలు రావడం వలన కూలిపోయిందని చెప్పడానికి నానా తంటాలు పడుతోంది. ఆర్.క్యు – 170 గా పిలిచే ఈ గూఢచార డ్రోన్ విమానం అత్యంత ఆధునికమైనదనీ, అత్యంత ఎత్తునుండి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తుందని అంగీకరిస్తూనే దాన్ని ఇరాన్ కూల్చిందన్న…