అబ్బోత్తాబాద్ స్ధావరం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరా? అబ్బే, అంత సీన్ లేదు -అమెరికా, పాక్ అధికారులు
పాకిస్ధాన్‌లోని అబ్బోత్తాబాద్ పట్టణంలో గల లాడెన్ స్ధావరమే ఆల్-ఖైదా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నారని అమెరికా చెప్పడాన్ని అటు అమెరికాలోనూ, ఇటు పాకిస్తాన్ లోనూ చాలామంది అంగీకరించ లేకపోతున్నారు. లాడెన్ స్ధావరంగా చెప్పబడుతున్న స్ధావరంలో అతన్ని హత్య చేశాక అక్కడినుండి చాలా సమాచారాన్ని తీసుకెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం ఒకేఒక టెర్రరిజం అనుమానితుడి వద్ద దొరికిన అతి పెద్ద గూఢచార సమాచారాల్లో ఒకటిగా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం ద్వారా లాడెన్ చివరివరకూ చురుగ్గా…