ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం – 2

సేమౌర్ హెర్స్ ఇంకా ఇలా రాశాడు. “అయితే అమెరికాకి చెందిన అత్యంత ఉన్నత స్ధాయి రహస్య గూఢచార నిర్ధారణలతో సహా పెద్ద పెద్ద సాక్షాలు (large body of evidence) అమెరికా సద్దామ్ హుస్సేన్, ఇరాక్ ల విషయంలో ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన తప్పులాంటి తప్పునే మళ్ళీ ఇరాన్ విషయంలోనూ చేసే ప్రమాదంలో ఉందని సూచిస్తున్నాయి. ఒక నిర్భంధ పాలకుడి విధానాలపై ఉన్న ఆత్రుతకొద్దీ ఆ ప్రభుత్వ మిలట్రీ సామర్ధ్యాలూ, ఉద్దేశాలపైన మన అంచనాలు తప్పు…

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం -1

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, యూరప్ దేశాలు దుష్ప్రచారం చేస్తూ ఆ దేశంపై నాలుగు దఫాలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియా అణు బాంబు నిర్మిస్తున్నదంటూ మరో అబద్ధపు ప్రచారం లంకించుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు అమెరికా, ఐరోపా దేశాల ప్రపంచ ఆధిపత్య రాజకీయాలో కోసమే అటువంటి అబద్ధపు ప్రచారానికి దిగుతాయన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ అణు ఇంధన సంస్ధ ఐన ఐ.ఎ.ఇ.ఏ, తాజాగా ఇరాన్ విషయంపై చర్చించడానికి సమావేశం…

ఇజ్రాయెల్ దాష్టీకంపై నిరసనలో పాలస్తీనా బాలుడు! -ఎ.ఎఫ్.పి ఫోటో

పాలస్తీనా భూభాగం నుండి, వారి ఇండ్లనుండి పాలస్తీనా కుటుంబాలను తరిమివేసి 63 సంవత్సరాలు పూర్తయ్యాయి. అమెరికా, ఇంగ్లండుల ప్రత్యక్ష చర్యతో, ఇతర యూరప్ దేశాల పరోక్ష మద్దతుతో తమ తమ దేశాల్లో పదుల వందల ఏళ్ళ క్రితం తరలివచ్చి స్ధిరపడిన యూదు జాతి వారిని వదిలించుకోవడానికి పన్నిన చారిత్రక కుట్రే పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ సృష్టి. ఆనాటి జాతి హననంలో లక్షల పాలస్తీనీయులను ఇజ్రాయెల్ సైన్యం వెంటాడి వేటాడింది. తమ ఇళ్ళను వదిలి పక్క దేశాలకు పారిపోయేదాక…

ఇరాన్ తర్వాత సిరియాపై అణు దౌర్జన్యం చేస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలు -గ్రాఫిక్స్

ఇరాన్ అణు బాంబులు తయారు చేయడానికే యురేనియం శుద్ధి చేస్తున్నదంటూ ఇరాన్ అణు కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలనుండి రాజకీయ, వాణిజ్య ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా తదితర పశ్చిమ దేశాలు తాజాగా సిరియాపై కూడా అదే తరహా ఎత్తుగడను అమలు చేస్తున్నాయి. ఇరాన్‌పై చేసినట్లే సిరియాపై కూడా అణు దౌర్జన్యం చేయడానికి సిద్ధపడుతున్నాయి. తమకు లొంగని దేశాలపై ఏదో ఒక పేరుతో అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించి ఆ దేశాల ప్రజల ఉసురు తీసే నరహంతక పశ్చిమ…