మార్కెట్ల విధ్వంసంపై ఇన్‌వెస్టర్ల హావ భావాలు -ఫోటోలు

గత శుక్రవారం అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఎస్‌&పి క్రెడిట్ రేటింగ్ సంస్ధ అత్యున్నత రేటింగ్ AAA నుండి రెండో అత్యున్నత రేటింగ్ AA+ కి తగ్గించింది. దానితో అమెరికా ప్రభుత్వం, కంపెనీలు, వినియోగదారులకు అప్పుల ఖరీదు (వడ్డీ రేటు) పెరిగిపోయింది. దానివలన పెట్టుబడులు తగ్గి, అప్పటికే అనేక బలహీనతలతో తీసుకుంటున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింత క్షీణిస్తుందనీ, అమెరికా మరొక సారి మాంద్యానికి (రిసెషన్) గురై అది ప్రపంచం అంతా వ్యాపిస్తుందనీ ఒక్క సారిగా భయాలు ఇన్‌వెస్టర్లను…

అమెరికా రేటింగ్ తగ్గింపుతో నిలువునా కూలుతున్న అమెరికా, యూరప్ షేర్ మార్కెట్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గింపుతో ప్రపంచంలోని అన్ని దేశాల షేర్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. జపాన్‌ని భూకంపం, సునామీలు తాకిన రీతిలో ఎస్&పి అమెరికా రేటింగ్ తగ్గింపు, ప్రపంచ షేర్ మార్కెట్లను తాకింది. సోమవారం ఇండియా షేర్ మార్కెట్లను దాదాపు రెండు శాతం పైగా లోయలోకి తోసేసిన ఈ పరిణామం యూరప్ షేర్ మార్కెట్లను రెండు నుండి నాలుగు శాతం వరకూ పతనం చేసింది. ఇక అమెరికా షేర్ మార్కెట్లు సైతం రెండున్నర నుండి మూడున్నర శాతం…

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గుదల తీవ్రమైన విషయమే -ఆర్ధిక మంత్రి ప్రణబ్

భారత ప్రభుత్వ ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అమెరికా క్రెడిట్ రేటింగ్ ని ఎస్ & పి రేటింగ్ సంస్ధ తగ్గించడంపై శనివారం స్పందించాడు. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడం “తీవ్రమైన విషయమే” అని అభివర్ణించాడు. అయితే విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందనీ, అది సరైంది కాదనీ ఆయన వ్యాఖ్యానించాడు. “అమెరికా క్రెడిట్ రేటింగ్‌ని డౌన్ గ్రేడ్ చేసిన చర్యని ఇంకా విశ్లేషించాల్సి ఉంది. దానికి కొంత సమయం కావాలి. విషయాలు పూర్తిగా…

టాప్ క్రెడిట్ రేటింగ్ AAA ను కోల్పోయిన అమెరికా

భయపడిందే జరిగింది. నెలల పాటు రుణ పరిమితి పెంపు కోసం, బడ్జెట్ లోటు తగ్గంపు కోసం సిగపట్లు పట్టుకుని చివరిదాకా తేల్చలేకపోయినందుకు అమెరికా ట్రెజరి జారీ చేసే రుణ బాండ్ల (సావరిన్ డెట్ బాండ్లు) రేటింగ్‌ను స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ తగ్గించింది. అమెరికా దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్ ను AAA నుండి AA+ కు తగ్గించింది. ప్రపంచ దేశాలు జారీ చేసే ట్రెజరీ బాండ్లలో అమెరికా బాండ్లకే అత్యధిక రేటింగ్ ఉంది. ట్రెజరీ బాండ్లు…