సిరియా సంస్కరణలకు అమెరికాయే అడ్డం -కార్టూన్
అరబ్ ప్రజల ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్షలను ఆసరా చేసుకుని అమెరికా వేలుపెట్టిన దేశాల్లో లిబియా మొదటిది కాగా సిరియా రెండవది. వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఎప్పటినుండో కన్నేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ ల బద్ధ శత్రువు ఇరాన్‌కు మిత్ర దేశంగా, పాలస్తీనాలో గాజాలో ప్రభుత్వం నడుపుతున్న హమాస్ సంస్ధకు మద్దతుదారుగా ఉన్న సిరియాలో తమ అనుకూల ప్రభుత్వం నిలపాలని అవి వేయని ఎత్తుగడా, పన్నని పన్నాగాలు…