దేవయాని అరెస్టుకు ముందు అమెరికా ఎంబసీలో ఏం జరిగింది?

న్యూయార్క్ లో భారత (మాజీ) డిప్యూటీ కాన్సల్ జనరల్  దేవయాని ఖోబ్రగదే పై మోపిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఇండియా డిమాండ్ చేస్తోంది. వీసా ఫ్రాడ్ కేసును అమెరికా కొనసాగించరాదని, కేసును వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదని భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ బుధవారం తనకు ఫోన్ చేశారని కానీ ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆయన తెలిపారు. అయితే ఇది నిజం…

బొలీవియాలో ఆయుధాలతో పట్టుబడిన అమెరికా ఎంబసీ కారు

దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో అమెరికా ఎంబసీ కి చెందిన కారు పేలుడు ఆయుధాలతో పట్టుబడిందని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ వెల్లడించింది. ఈశాన్య బొలీవియాలోని ‘ట్రినిడాడ్’ పట్టణంలో మంగళ వారం జరిగిన ఈ ఘటనను ‘జాతీయ భద్రత’ కు సంబధించిన అంశంగా బొలీవియా హోమ్ మంత్రి కార్లోస్ రొమేరో వ్యాఖ్యానించాడు. మూడు షాట్ గన్ లు, ఒక రివాల్వర్, రెండు వేల బులెట్ కాట్రిడ్జ్ లతో సహా మరి కొన్ని పేలుడు పదార్ధాలు అమెరికా ఎంబసీ కారులో…