అమెరికా: వడ్డీ రేటు ఇప్పట్లో పెంచేది లేదు
తమ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ఇప్పట్లో పెంచడం సాధ్యం కాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ ప్రకటించింది. చికాగో రాష్ట్ర ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు చార్లెస్ ఇవాన్స్ ఈ మేరకు స్పష్టం చేశారని రాయిటర్స్ తెలిపింది. వడ్డీ రేటు పెంచితే ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ గాడి తప్పుతుందని ఆయన అంచనా వేశారు. నిరుద్యోగం ఇంకా తీవ్రంగానే ఉన్నదని, బాగా తక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెంపు వల్ల…