అమెరికా: ఒక్క రోజులో 328 బిలియన్ల అప్పు
ఋణ పరిమితి పెంపుకు అంగీకరిస్తూ అమెరికా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందం చట్టంగా మార్చుతూ ఒబామా సంతకం చేసిన అనంతరం ఒక్క రోజులోనే అమెరికా 328 బిలియన్ డాలర్ల అప్పు చేసింది. ఇది దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అనగా 2013-14 ఆర్ధిక సంవత్సరానికి మన వార్షిక బడ్జెట్ అయిన 16.65 లక్షల కోట్ల రూపాయల కంటే 3.35 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ. ఒబామా కేర్ పధకానికి నిధుల కేటాయింపు…

