అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -1

ప్రజాస్వామిక సంస్కరణల కోసం అరబ్ దేశాల్లో ప్రజానీకం ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యమిస్తున్న నేపధ్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్యానికి తీవ్రం ఆటంకాలు తలెత్తాయి. ఇజ్రాయెల్ కు అరబ్ దేశాలలో గట్టి మద్దతుదారులుగా ఉన్న ట్యునీషియా, ఈజిప్టు లలో నియంతృత్వ ప్రభుత్వాలు కూలిపోయాయి. కుట్రలు పన్ని ఆ రెండు దేశాలలో ప్రజా ఉద్యమాలు చివరివరకు కొనసాగకుండా అమెరికా చూసుకోగలిగింది. తమ పాత అనుచరులను, నమ్మకస్తులనే ఆ దేశాల్లో పాలకులుగా కొనసాగించగలుగుతోంది. అరబ్ ప్రజా ఉద్యమాలకు…