ఫ్రాన్స్ లో లండన్ తరహా అల్లర్లు, ఆర్ధిక సామాజిక సమస్యలే కారణం
డజన్ల కొద్దీ యువకులు రోడ్లపైకి వచ్చి రోజంతా లూటీలకూ, దహనాలకూ పాల్పడిన ఘటన ఫ్రాన్సులో చోటు చేసుకుంది. ఉత్తర ఫ్రాన్సులోని అమీన్స్ పట్టణంలో జరిగిన ఈ అల్లర్లలో 16 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని పోలీసులు చెప్పగా ప్రజలు ఎంతమంది గాయపడిందీ ఏ పత్రికా చెప్పలేదు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయిన అల్లర్లు అదనపు బలగాల రాకతో మగళవారం తెల్లవారు ఝాము 4 గంటలకు ముగిశాయని ఎ.పి తో పాటు ఇతర వార్తా సంస్ధలు తెలిపాయి.…
