ఆ డాక్టరే లాడెన్‌ని పట్టిచ్చాడు -అమెరికా

బిన్ లాడెన్ ఆచూకి తెలుసుకోవడంలో తమకు సహాయపడింది పాకిస్ధాన్ ప్రభుత్వం అరెస్టు చేసిన డాక్టరేనని అమెరికా మొదటిసారి ధృవీకరించింది. డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ఓ టెలివిజన్ ఛానెల్ కి ఇంటర్వూ ఇస్తూ ఈ నిజాన్ని కక్కాడు. అబ్బోత్తాబాద్ లో లాడెన్ నివసించాడని చెబుతున్న ఇంటికి సమీపంలోనే పెనెట్టా చెబుతున్న డాక్టర్ నివాసం ఉంటున్నాడు. అమెరికాకి చెందిన నావీ సీల్ విభాగ కమాండర్లు రెండు హెలికాప్టర్లలో బయలుదేరి, పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెప్పకుండా, పాకిస్ధాన్ గగనతలంలోకి జొరబడి, ఒసామా…