అవినీతి బైటపెట్టినందుకు ప్రాణ భయంతో పారిపోయిన ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్

ఆఫ్ఘనిస్ధాన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ కదీర్ ఫిట్రాట్ ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోవడం ఇక్కడ సంచలనం సృష్టించింది. గవర్నరు పదవికి రాజీనామా చేసి మరీ పారిపోయిన కదీర్ అమెరికాలో తేలాడు. ఆయనకి అమెరికాలో నివాస గృహం ఉందని తెలుస్తోంది. కాబూల్ బ్యాంక్ అనే ప్రవేటు బ్యాంకులో జరిగిన అవినీతిపై అబ్దుల్ కదీర్ దర్యాప్తు జరిపాడు. అవినీతికి పాల్పడినవారి పేర్లను పార్లమెంటులో బహిర్గతం చేశాడు. ఆయన బైటపెట్టిన పేర్లలో అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు మహమూద్…