అప్పుల కుప్ప యూరప్
కొత్త సంవత్సరం యూరో దేశాలకు అనుకూలంగా ఉన్నట్లు లేదు. పదిహేడు దేశాల యూరో జోన్ కూటమి కొత్త సంవత్సరంలో చెల్లించవలసిన అప్పులు దాదాపు 700 బిలియన్ యూరోల వరకూ ఉంది. ఈ అప్పు చెల్లించకపోతే అలా చెల్లించలేని దేశం డిఫాల్ట్ (దివాలా) తీసినట్లుగా ముద్రపడుతుంది. దివాలా తీసిన దేశానికి కొత్త అప్పులు ముట్టవు గనక రోజువారి ఖర్చులు గడవడం కూడా గగనం గా మారుతుంది. దివాలా తీసిన దేశాలకు సాయం చెయ్యడానికి యూరప్ దేశాలు ఒక ట్రిలియన్ యూరోల…
