సిరియాలో జరుగుతున్నదీ, పత్రికల్లో వస్తున్నదీ ఒకటి కాదు -అన్హర్ కొచ్నెవా
సిరియా లో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారనీ, ప్రభుత్వం వారినీ అత్యంత క్రూరంగా చంపుతోందనీ, అణచివేస్తోందనీ పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. నిత్యం అక్కడ హత్యాకాండలు జరుగుతున్నాయనీ ప్రభుత్వ సైనికులు, ప్రభుత్వ మద్దతుదారులయిన మిలిషియా లు అత్యంత క్రూరంగా ప్రజలను చంపుతున్నాయనీ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ మధ్యనే ‘హౌలా హత్యాకాండ’ అంటూ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లతో పాటు ఇతర పశ్చిమ దేశాలు కాకి గోల చేస్తూ సిరియా పై…
