అన్నా బృందం నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు -స్వామి అగ్నివేష్
అన్నా బృందంతో కలిసి కొంతకాలం పాటు నడిచిన స్వామి అగ్నివేష్, ఆ బృందం సభ్యులు కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని శుక్రవారం ఆరోపించాడు. తమ బృందం నుండి అగ్నివేష్ను తప్పించిన ‘టీమ్ అన్నా’ దీక్ష ముగిశాక అగ్నివేష్ మాట్లాడినదని చెబుతూ ఒక సి.డిని విడుదల చేశారు. అవతలి వ్యక్తితో అన్నా బృందానికి అంతకాలం అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదని చెబుతున్న ఈ సిడిలో కొంతభాగం మార్చారని ఆరోపించాడు. అగ్నివేశ్ ‘కపిల్జీ’ అని సంబోధించడాన్ని బట్టి అవతలి వ్యక్తిని…