సంక్షోభంలో ‘అన్నా బృందం’, ఇద్దరు సభ్యులు దూరం
అన్నా బృందం ఐక్యత సంక్షోభంలో పడింది. ఇటీవల జరిగిన పరిణామాల పర్యవసానంగా బృందంలో ఇద్దరు ప్రముఖ సభ్యులు బృందం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో బృందం బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పి.వి.రాజగోపాల్, ‘వాటర్ మేన్’ రాజీందర్ సింగ్ లి మంగళవారం కోర్ గ్రూపునుండి తప్పుకోవాలన్న తమ ఉద్దేశ్యాన్ని బహిరంగపరిచారు. అన్నా బృందం రాజకీయ లక్షణాలను సంతరించుకుంటున్నదని వీరు భావిస్తుండడంతో వీరీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోర్ సభ్యులతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో తమవి కాని నిర్ణయాలకు బాధ్యత…