టీం అన్నా రాజకీయ రంగ ప్రవేశం -కార్టూన్
అన్నా బృందం రెండో నిరాహార దీక్ష ఎంత చప్పగా ప్రారంభం అయిందో అంతే చప్పగా ముగిసిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ పది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా, జనం కోసం అన్నా కూడా ఆయనతో జత కలిసినా పట్టించుకున్నవారు లేరు. అన్నా హజారే గత సంవత్సరం చేసిన నిరాహార దీక్షకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన పత్రికలు, ఛానెళ్ళు ఈసారి అంతగా పట్టించుకోలేదు. అన్నా దీక్ష విరమణ కోసం పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం,…
