ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్ళరాదని హజారే నిర్ణయం
ఉత్తర ప్రదేశ్ తో సహా త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి వెళ్లరాదని అన్నా హజారే నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అన్నా బృందం కోర్ గ్రూపు సభ్యురాలు కిరణ్ బేడీ గురువారం ప్రకటించింది. అన్నా అనారోగ్యంగా కారణంగా ముందు అనుకున్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఆమె తెలిపింది. “రాష్ట్రాల ఎన్నికల్లో అన్నా ప్రచారం చేయడం లేదు. అన్నా ప్రయాణాలు చెయ్యరు. ఆయన ప్రయాణాలు చెయ్యవద్దని మేమూ కోరాము. ఆయన…
