అన్నా అరెస్టు, లోక్‌పాల్ బిల్లు లపై రెండు కార్టూన్లు
జైలులో ఉండవలసినవారు సమాజంలో సంచరిస్తుంటే, సమాజం బాగు కోసం సమాజంలో ఉండవలసినవారు జైలులో మగ్గుతున్నారని అనేక మంది పెద్దలు అనేకసార్లు చెప్పారు. ప్రభుత్వాల చర్యలు, చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. అన్నా హజారే, ఆయన స్నేహితుల అరెస్టుతో అది మరొకసారి రుజువయ్యింది. “మనకంటే ప్రమాదకరమైన వాళ్ళని ఉంచడానికి జైలులో ఖాళీ లేదట!“ ————————————————— కోరలు లేని లోక్‌పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. శక్తివంతమైన బిల్లుని తెమ్మని అన్నా హాజారే బృందం…