‘అనూజ్ బిద్వే’ హత్య కేసు విచారణ జూన్ లో
ఇంగ్లండులో హత్యకు గురైన అనూజ్ బిద్వే కేసు విచారణ జూన్ నెలలో చేపట్టనున్నారు. జాత్యహంకారంతో జరిగిన హత్యగా అనుమానిస్తున్న ఈ కేసులో నిందితుడు ఇరవై ఏళ్ళ ‘కియారాన్ స్టేపుల్ టన్’. ఇతను తనను ‘సైకో స్టేపుల్ టన్’ గా పిలవాల్సిందిగా తన మిత్రులను కోరేవాడని తెలుస్తోంది. జూన్ 25, 2012 నుండి కేసులో ట్రయల్స్ ప్రారంభం చెయ్యడానికి కోర్టు నిర్ణయించింది. సాల్ ఫర్డ్ లోని మాంఛెస్టర్ లో అనుల్ బిద్వే తన మిత్రులతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా…
